ఆసక్తిగలవారు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవొద్దు

by Sridhar Babu |
Dont-Miss
X

దిశ, బోధన్: బోధన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల 18 మద్యం దుకాణాల కేటాయింపునకు దరఖాస్తులను ఈ నెల 18న సాయత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నారని ఎక్సైజ్ సీఐ బాలరాజు తెలిపారు. దరఖాస్తులను ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో తీసుకోనున్నట్లు తెలిపారు. స్టేషన్ పరిధిలో ఉన్న దుకాణాలలో నాలుగు ఎస్సీలకు, ఒకటి ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డాయని తెలిపారు. ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో బోధన్ ఎక్సైజ్ సీఐ బాలరాజు పేర్కొన్నారు.

Advertisement

Next Story