- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కూల్చిన కమ్యూనిటీ హాల్ పునర్ నిర్మించాలి- ఏఐఎఫ్‌డీఎస్

దిశ, శేరిలింగంపల్లి: మియాపూర్ గ్రామంలో పునర్నిర్మాణం పేరుతో కూల్చివేసిన కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ జీహెచ్ఎంసీ ఉప కమీషనర్ సుధీర్ కు ఏఐఎఫ్ డీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మురళీ వినతి పత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో మియాపూర్ గ్రామంలో ప్రజల సౌకర్యార్థం నాటి ప్రభుత్వం కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టిందని, తద్వారా వందలాది మందికి ఎంతగానో ఉపయోగపడిందన్నారు.
కానీ గత మూడు సంవత్సరాల క్రితం ఈ కమ్యూనిటీ హాల్‌ను పునర్నిర్మాణం చేస్తామని కూల్చివేశారని, తర్వాత పిల్లర్ల నిర్మాణం కోసం పునాదులు తవ్వి వదిలేసి, ఇప్పటివరకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయలేదన్నారు. గ్రామంలో డ్వాక్రా మహిళా గ్రూపుల సమావేశాలు, యూత్ కార్యక్రమాలు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు ఇబ్బందిగా మారిందన్నారు. ప్రజాశ్రేయస్సు దృష్ట్యా తక్షణమే తగిన నిధులు కేటాయించి నిర్మాణ పనులు ప్రారంభించాలని ఏఐఎఫ్ డీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మురళీ డిమాండ్ చేశారు.