రియల్‌మీ ‘సీ’ సిరీస్‌లో బడ్జెట్ ఫోన్లు

by  |
రియల్‌మీ ‘సీ’ సిరీస్‌లో బడ్జెట్ ఫోన్లు
X

ప్రముఖ చైనా మొబైల్ తయారీదారు(China Mobile Manufacturer) రియల్‌మీ(Realmi).. సీ సిరీస్‌లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ల(Budget smartphones)ను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రియల్‌మీ సీ1, రియల్‌మీ సీ2, రియల్‌మీ సీ3, రియల్‌మీ సీ11 స్మార్ట్‌ఫోన్ల(Smartphones)ను ఇండియన్ మార్కెట్‌(Indian Market)కు పరిచయం చేసింది.

ఇప్పుడు ఇదే సిరీస్‌(Series)లో మరో రెండు మొబైల్స్‌ను పరిచయం(Introduce) చేయబోతోంది. రియల్‌మీ సీ12, రియల్‌మీ సీ15 మోడల్స్‌(Models)ను ఆగస్ట్ 18న లాంచ్(Launch) చేయనున్నట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. 6,000 ఎంఏహెచ్(6,000 mAh) సామర్థ్యం గల భారీ బ్యాటరీ(big battery) ఈ ఫోన్ల ప్రత్యేకత. అంతేకాదు ధర కూడా రూ.10,000 లోపే ఉంటుందని అంచనా. ఇప్పటికే ఇండోనేషియా మార్కెట్‌(Indonesian market)లో రియల్‌మీ సీ15 మోడల్‌ లాంచ్ అయ్యింది. ఇక రియల్‌మీ సీ12 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి స్పెసిఫికేషన్స్‌ (Specifications) తో పాటు ఇతర ఫోన్ల మిగతా స్పెసిఫికేషన్స్ తెలియాలంటే.. విడుదల వరకు వెయిట్ చేయాల్సిందే.

రియల్ మీ సీ15 ఫీచర్స్ :

డిస్ ప్లే : 6.50 ఇంచులు
ప్రాసెసర్ : ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ35ఎస్‌వోసీ
ర్యామ్ : 3జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్ : 64జీబీ
రేర్ కెమెరా : 13 +8+2+మెగాపిక్సల్
ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
ఓఎస్ : ఆండ్రాయిడ్10
బ్యాటరీ : 6000 ఎంఏహెచ్


Next Story

Most Viewed