జూలై 14న లాంచ్ కానున్న రియల్ మీసీ11

by  |
జూలై 14న లాంచ్ కానున్న రియల్ మీసీ11
X

దిశ, వెబ్ డెస్క్: రియల్ మీ సంస్థ నూతన స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూనే వుంది. అయితే ఈసారి మాత్రం బడ్జెట్ ఫోన్‌ను తమ కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకు వస్తుంది. రియల్ మీ సీ11 పేరుతో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ ఈ నెల 14వ తేదీన ఇండియాలో లాంచ్ చేయనుంది. వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్ ప్లే, రివర్స్ చార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ మొదట మలేషియాలో లాంచ్ అయింది. అక్కడ దీని ధర 429 మలేషియా రింగెట్లు (రూ.7,600)గా నిర్ణయించారు. మింట్ గ్రీన్, పెప్పర్ గ్రే రంగుల్లో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

రియల్ మీ సీ 11 ఫీచర్స్:

డిస్ ప్లే : 6.5 ఇంచులు

ప్రాసెసర్ : మీడియాటెక్ హీలియో జీ35

ర్యామ్ : 2జీబీ

ఇంటర్నల్ స్టోరేజ్ : 32జీబీ

రేర్ కెమెరా : 13+2 మెగాపిక్సల్

ఫ్రంట్ కెమెరా : 5మెగాపిక్సల్

ఓఎస్ : ఆండ్రాయిడ్

బ్యాటరీ : 5000ఎంఏహెచ్

రంగులు : మింట్ గ్రీన్, పెప్పర్ గ్రే

ధర : రూ. 7,500


Next Story

Most Viewed