- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నట్టడవిలో ఒంటరి వ్యక్తి.. సినిమాను తలపిస్తున్న చంద్రశేఖర్ స్టోరీ
దిశ, ఫీచర్స్: నేటి సాంకేతిక యుగంలో ఇంటర్నెట్, సోషల్ మీడియా, యాప్స్ లేకుండా బతకగలమా? అంటే ఆలోచించాల్సిందే. ఇవి లేకుండా జీవించడం కష్టమే కాదు, నష్టం కూడా అనేంతగా అలవాటు పడిపోయాం. అయితే 56 ఏళ్ల చంద్రశేఖర్ మాత్రం తన లైఫ్‌స్టైల్‌తో అందరి దృష్టికోణాన్ని మార్చేస్తున్నాడు. టెక్నాలజీకే కాదు నాగరికత, పల్లె జీవనానికి దూరంగా.. దట్టమైన అడవిలో జంతువుల మధ్య జీవనం సాగిస్తున్నాడు. హాలీవుడ్ మూవీ ‘కాస్ట్ వే’ని తలపిస్తున్న చంద్రశేఖర్ 17 ఏళ్ల ప్రకృతి ప్రయాణం ఆద్యంతం ఆసక్తికరం కాగా.. ఆ విశేషాలు.
చంద్రశేఖర్.. దక్షిణ కన్నడ జిల్లా, అడేల్-నెక్కరే గ్రామాల మధ్య గల దట్టమైన అడవిలో చిన్న టెంట్‌లో నివసిస్తున్నాడు. అక్కడికి చేరుకోవాలంటే అడవి మార్గం గుండానే 3-4 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. పచ్చని చెట్ల మధ్య కాలం గడుపుతున్న తనకు ప్రపంచంతో సంబంధం లేకపోయినా.. అక్కడి వార్తలు చేరవేసేందుకు మాత్రం ఓ రేడియో ఉంది. విచిత్రంగా ఆ టెంట్ పక్కనే ఓ అంబాసిడర్ కారు కూడా ఉండగా.. చంద్రశేఖర్ అరణ్యజీవితం గడపడం వెనక ఓ కథ ఉంది.
ఎలా జీవిస్తున్నాడంటే?
శేఖర్.. నెక్కరే కెమ్రాజే గ్రామంలో ఉన్న 1.5 ఎకరాల పొలాన్ని సాగుచేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుండేవాడు. అయితే పలు కారణాల వల్ల 2003లో సహకార బ్యాంకు నుంచి తీసుకున్న రూ. 40,000 రుణాన్ని తిరిగి చెల్లించలేకపోయాడు. ప్రతిగా బ్యాంక్ అతడి పొలాన్ని వేలం వేసింది. ఈ విషయం తట్టుకోలేకపోయిన శేఖర్.. తన అంబాసిడర్ కారులో అడేల్‌లోని తన సోదరి ఇంటికి వెళ్లాడు. కొన్ని రోజుల తర్వాత, సోదరి కుటుంబం నుంచి విడిపోయి ఒంటరిగా జీవించాలని నిర్ణయించుకున్నాడు. అంతే అక్కడి నుంచి కారులో దట్టమైన అడవిమార్గాన ప్రయాణిస్తూ వెళ్లిన శేఖర్.. ఓ చోట కారును నిలిపి ఎండావాన నుంచి రక్షణగా ఒక చిన్న గుడారం వేసుకున్నాడు. అలా నాటి నుంచి నేటివరకు.. అంటే దాదాపు 17 ఏళ్లుగా అక్కడే ఉంటున్నాడు. చెట్లపై ఎండిన తీగలను ఉపయోగించి బుట్టలను తయారుచేస్తూ, వాటిని సమీప గ్రామాల్లోని దుకాణాల్లో విక్రయించి బియ్యం సహా ఇతర కిరాణా సామగ్రిని తీసుకుంటాడు. ఇన్నేళ్లలో ఏనుగులు, అడవి పందులు, జింకలు, చిరుతలు, అడవి దున్నలు వంటివెన్నో అతడికి కనిపించినా.. అవి ఏనాడూ తనకు హాని చేయలేదు. అటవీ శాఖకు కూడా అతడితో ఏ సమస్యా లేకపోవడంతో ఉండేందుకు అభ్యంతరం తెలపలేదు.