- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీకి అచ్చెన్నాయుడు సవాల్
దిశ, ఏపీ బ్యూరో : ఉత్తరాంధ్రను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్ సర్కార్ ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రత్యక్ష పోరుకు సిద్ధమైంది. అందులో భాగంగా సోమవారం విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర రక్షణ- చర్చావేదిక పేరుతో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైసీపీకి సవాల్ విసిరారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించి ఏ అంశంపైనైనా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. వేదిక ఎక్కడో అధికార పార్టీ నేతలు చెప్తే..చర్చకు తాము వస్తామని సవాల్ విసిరారు. ఉత్తరాంధ్ర ప్రజల సుజల స్రవంతి, వంశధార-బహుదా నదుల అనుసంధానం వంటి బృహత్తర కార్యక్రమాలను వైసీపీ ప్రభుత్వం భ్రష్టుపట్టించిందని ఆరోపించారు.
ఉత్తరాంధ్రలో ఎస్. బాస్ అనే వ్యక్తులు మంత్రులుగా ఉన్నారే తప్ప ప్రజల కోసం పోరాడేవారు కాదని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లే సత్తా ఉన్న ఒక్కరు మంత్రులుగా లేరని మండిపడ్డారు. వంశధార ప్రాజెక్టు వల్ల పార్టీకి నష్టం జరిగింది. కానీ సమాజ హితం కోసం రిస్క్ చేశాం. మిగిలిన 10శాతం పనులను ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదు. అభివృద్ధి చేయలేక ముఖ్యమంత్రి మూడు రాజధానులు అంశం తెరపైకి తెచ్చారు అని తీవ్రస్థాయిలో అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. ఉత్తరాంధ్ర సమస్యలను ఈ ప్రాంత మంత్రులు సీఎం జగన్ వద్ద ప్రస్తావించగలరా? అని ప్రశ్నించారు. విశాఖ మెడ్‌టెక్ జోన్‌పై గతంలో వైసీపీ నేతలు ఇష్టంవచ్చినట్లు మాట్లాడారని.. కరోనా సమయంలో అదే ప్రజల ప్రాణాలు కాపాడిందని గుర్తు చేశారు. అభివృద్ధి చేయాలని సీఎం అనుకుంటే ఏమైనా చేయోచ్చని.. జగన్ ఈ ప్రాంతానికి ఏం చేశారని అచ్చెన్న ప్రశ్నించారు.
ఉత్తరాంధ్ర ప్రాంతానికి టీడీపీ ఏం చేసిందో చెబుతామని.. మీరేం చేశారో చెప్పగలరా? అంటూ వైసీపీ నేతలకు టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. ఇకపోతే జిల్లాల వారీగా సదస్సులు నిర్వహించి.. అనంతరం ప్రజల్లోకి వెళ్లాలని టీడీపీ వ్యూహరచన చేస్తోంది. ఉత్తరాంధ్ర అభివృద్దికి సంబంధించి టీడీపీ చేసిన కార్యక్రమాలను..వైసీపీ చేసిన పనులను నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని టీడీపీ వ్యూహరచన చేస్తోందని తెలుస్తోంది.