మెదక్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..?

by Shyam |
మెదక్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..?
X

దిశ, మెదక్: అడుగడుగునా గుంతలు పడిన రోడ్లు, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామంటూ దుబ్బాక ఎన్నికల ప్రచారంలో ఊదరగొడుతున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డిపై యువజన కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

దుబ్బాక ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్‌ను అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏదీ లేదని, కేవలం మాటలకే పరిమితం అయ్యారని విమర్శించారు. పద్మాదేవేందర్ రెడ్డి ప్రచారాన్ని ఖండిస్తూ మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో గురువారం ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేశారు.

Advertisement

Next Story