- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RBI కొత్త రూల్స్.. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు యూజర్స్‌కి గుడ్ న్యూస్..
దిశ, వెబ్‌డెస్క్ : డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు వాడుతున్న వారికి గుడ్ న్యూస్. కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు మరింత సురక్షితం కానున్నాయి. ఈ కొత్త రూల్స్ 2022 జనవరి నుంచి అమలులోకి రానున్నాయి. కార్డు వివరాల స్థానంలో టోకెనైజేషన్ వ్యవస్థను అమలులోకి తీసుకురానున్నారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI కొత్త నిబంధనలు తీసుకువస్తోంది.
దీంతో కార్డు కలిగిన వారు CVV నెంబర్ ఎంటర్ చేయకుండానే ట్రాన్సాక్షన్ పూర్తి చేయొచ్చు. ఈ క్రమంలో కార్డు లావాదేవీలు నిర్వహించేటప్పుడు సంబంధిత కార్డు వివరాలు కాకుండా టోకెన్ కోడ్‌ను ఎంటర్ చేస్తే సరిపోతుంది. దీంతో మీ కార్డు సమాచారం ఎవ్వరికీ తెలియదు. మీ వివరాలు సురక్షితంగానే ఉంటాయి. ఆర్‌బీఐ ఇప్పటికే మర్చంట్లకు ఆదేశాలు జారీ చేసింది. కార్డు వివరాలు స్టోర్ చేసుకోవద్దని తెలిపింది.
గూగుల్ పే, పేటీఎం, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ వంటి వాటిల్లో కార్డు వివరాలు ఎంటర్ చేసినప్పుడు.. ఇవి టోకెన్ సర్వీస్ ప్రొవైడర్లుగా వ్యవహరించే కార్డు నెట్‌వర్క్ కంపెనీలైన వీసా, మాస్టర్ కార్డు వంటి వాటికి టోకెన్ కోసం రిక్వెస్ట్ పంపిస్తాయి. ఇవి కస్టమర్ల కార్డు వివరాలను వారి బ్యాంక్ వివరాలతో చెక్ చేసుకొని టోకెన్ నెంబర్లను జనరేట్ చేస్తాయి. ఇవి కస్టమర్ డివైజ్‌తో లింక్ అవుతాయి. తర్వాత ఎప్పుడైనా లావాదేవీలు నిర్వహిస్తే.. కార్డు నెంబర్, సీవీవీ నెంబర్లు ఎంటర్ చేయాల్సిన పని లేదు. టోకెన్ నెంబర్ వివరాలు ఇస్తే సరిపోతుంది.