- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ద్రవ్య విధాన కమిటీ సమావేశం వాయిదా
by Harish |

X
దిశ, వెబ్‌డెస్క్: ఈ వారంలో జరగాల్సిన ద్రవ్య విధాన కమిటీ(ఎంపీసీ) సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) సోమవారం తెలిపింది. త్వరలో కొత్త తేదీలను ప్రకటిస్తామని ఆర్‌బీఐ పేర్కొంది. అయితే, సమావేశాం వాయిదాకు సంబంధించి కారణాలను ఆర్‌బీఐ వెల్లడించలేదు. సెప్టెంబర్ 29 నుంచి మూడు రోజుల పాటు జరగాల్సిన ఎంపీసీ సమావేశం వాయిదా వేస్తూ..కొత్త తేదీలని పరిశీలించి త్వరలో ప్రకటించనున్నట్టు ఆర్‌బీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఎంపీసీ కమిటీలో కొత్త సభ్యులపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం ఆర్‌బీఐ వేచి ఉంది. ఆర్‌బీఐ చట్టం ప్రకారం..ఎంపీసీ ఎక్స్‌టర్నల్ మెంబర్‌ల పదవీకాలం నాలుగేళ్లు ఉంటుంది.
Next Story