- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్‌బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు.. అందులో విఫలం అవుతున్నారు
దిశ, వెబ్‌డెస్క్: ఆడిటింగ్ నిర్వహణకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని సందర్భాల్లో ఆడిటర్లు అకౌంట్లలోని అవకతవకలను గుర్తించడంలో విఫలమవుతున్నారని, అకౌంటింగ్ ప్రక్రియలో మరింత కఠినంగా వ్యవహరించాలని దాస్ అభిప్రాయపడ్డారు. ఆడిటింగ్ వల్ల ప్రజల్లో సైతం విశ్వాసం పెరుగుతుందని, సమర్థవంతమైన ఆర్థికవ్యవస్థకు అంతే సమర్థవంతమైన ఆడిటింగ్ చేపట్టడం అవసరమని దాస్ తెలిపారు.
నేషనల్ అకాడమీ ఆఫ్ ఆడిట్ అండ్ అకౌంట్స్(ఎన్ఏఏఏ) సమావేశంలో పాల్గొన్న ఆయన.. పబ్లిక్ ఫైనాన్స్ ఆడిటింగ్ నిర్వహించడం కీలకం. వీటి ఆదారంగానే ప్రభుత్వాలు ఖర్చులకు సంబంధించిన నిర్ణయాలను తీసుకుంటారు. ఆడిట్ నిర్వహణలో నాణ్యత పెరగాల్సిన అవసరం ఉందని, ఆర్థికవ్యవస్థల్లో పెరుగుతున్న ప్రతికూలత వల్ల ఆడిటింగ్ అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియగా దాస్ వివరించారు. ప్రస్తుతం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆడిటర్లు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. ఆడిటింగ్ ప్రమాణాలను పెంచేందుకు ఆడిటింగ్ వర్గాలతో ఎప్పటికప్పుడు ఆర్‌బీఐ సంప్రదింపులు జరుపుతోందని, బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలలో పటిష్టమైన ప్రభుత్వ ఫ్రేమ్‌వర్క్ ఉండాలని ఆర్‌బీఐ కోరుతోందని దాస్ చెప్పారు.