- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వడ్డీరేట్లలో మార్పులేదు..ముగిసిన ఆర్‌బీఐ సమావేశం!

బడ్జెట్ తర్వాత మదుపరులు ఆశగా ఎదురుచూస్తున్న ఆర్‌బీఐ ద్వైమాసిక సమీక్షా సమావేశం ముగిసింది. సమావేశంలో మార్కెట్లు కోతలపై ఆశలు పెట్టుకోగా సమిటీ సభ్యులంతా రేట్లను యథాతథంగా ఉంచాలని ఓటు వేశారు. ఆరుగురు సభ్యులతో కూడిన ఎంపీసీ కమిటీ రేట్లను యథాతథంగా ఉంచడానికి ఏకగ్రీవంగా ఓటు వేయడంతో కలిసొచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈ కమిటీ సమావేశమే చివరి రివ్యూ.
ఆర్‌బీఐ ద్రవ్య విధాన నిర్ణయంలో కీలక వడ్డీరేట్లను స్థిరంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఆర్‌బీఐ ద్రవ్య విధాన రెపో రేటును 5.15 శాతాన్నే కొనసాగించనుంది. రివర్స్ రెపో రేటును 4.90 శాతంగా ఉంచింది. 2019లో ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ రెపోరేటు మొత్తం 135 బేసిస్ పాయింట్ల తర్వాత వరుసగా ఐదుసార్లు రేట్లు తగ్గించింది. ద్రవ్యోల్బణం పెరగడం వంటి కారణాలతో గత సమావేశంలో రెపో రేటును తగ్గించకుండా కమిటీ విరామం తీసుకుంది. ఆర్‌బీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో రియలిటీ రంగానికి భారీ ఊరట లభించిందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆహార ధరలు పెరిగినందున రిటైల్ ద్రవ్యోల్బణం 2019 డిసెంబర్‌లో 7.35 శాతానికి పెరిగింది. ఇది ఆర్‌బీ లక్ష్యం కంటే అధికం కావడం గమనార్హం.