లేడీ కానిస్టేబుల్‌తో జడేజా భార్య గొడవ

by  |
లేడీ కానిస్టేబుల్‌తో జడేజా భార్య గొడవ
X

దిశ, స్పోర్ట్స్: టీం ఇండియా ఆల్‌రౌండర్(Team India all-rounder) రవీంద్ర జడేజా( Ravindra Jadeja) భార్య రివాబా వివాదం(Controversy)లో చిక్కుకున్నారు. సోమవారం రాత్రి కారులో వెళ్తున్న ఆమె మాస్కు ధరించలేదని(Not wearing a mask) రాజ్‌కోట్ పోలీసులు(Rajkot police) ఆపగా.. ఒక లేడీ కానిస్టేబుల్‌(Lady Constable)తో రివాబా వాగ్వివాదానికి దిగారు. దీంతో ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ(Inquiry)కు ఆదేశించారు.

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో భార్యతో కలసి జడేజా(Jadeja) కారులో ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో వారిద్దరితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. కిసాన్‌పర చౌక్(Kisanpara Chowk) వద్ద ఆమె మాస్క్ ధరించలేదని గుర్తించిన లేడీ హెడ్‌కానిస్టేబుల్(Lady Headconstable) సోనల్ గోసాయ్ కారును ఆపారు. జడేజా మాస్క్ ధరించగా, అతని భార్య మాత్రం ధరించలేదు. ఎందుకు మాస్క్ ధరించలేదని ప్రశ్నించడంతో ఇద్దర మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఇరువురు తీవ్ర పదజాలం(Serious vocabulary)తో దూషించుకున్నట్లు ప్రాథమిక విచారణ(Preliminary investigation)లో తేలింది. అయితే గొడవ ఎలా మొదలయ్యిందనే దానిపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. జడేజా భార్యపై కానిస్టేబుల్ ఫిర్యాదు(Complaint) చేయగా, తన భార్యపై కానిస్టేబుల్ అతిగా ప్రవర్తించిందని జడేజా కూడా పోలీసులకు ఫిర్యాదు(Complaint) చేశాడు. కాగా, ఈ గొడవకు సంబంధించిన ఒత్తిడి తట్టుకోలేక లేడీ కానిస్టేబుల్ సోనాల్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.


Next Story

Most Viewed