- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రజాకార్లనే తరిమికొట్టినది ఎర్ర జెండా ;రావులపల్లి రవి
by Sridhar Babu |

X
దిశ, భద్రాచలం టౌన్ : తెలంగాణ గడ్డపై అరాచకాలను సృష్టించిన కాశిం రజ్వీ రజాకార్లు, దేశ్ ముక్‌లనే తరిమికొట్టిన ఎర్ర జెండాకు నియంతల పాలన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, మతోన్మాదంతో విర్రవీగుతున్న మోడీ పాలనకు చరమగీతం పాడటం పెద్ద లెక్కేమీ కాదని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రావులపల్లి రవి కుమార్ అన్నారు. భద్రాచలం సీపీఐ కార్యాలయంలో జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 74 వ వార్షికోత్సవ సభలో రవికుమార్ మాట్లాడారు. వీర తెలంగాణ విప్లవ సాయుధ రైతాంగ పోరాటం స్పూర్తిగా అమరుల త్యాగాన్ని పుణికిపుచ్చుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలనాల పై పోరాటాలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చరిత్రని వక్రీకరిస్తుందని విమర్శించాడు.
Next Story