- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాగర్ బీజేపీ అభ్యర్థిగా రవికుమార్ ఖరారు
దిశ ప్రతినిధి, నల్లగొండ : నాగార్జునసాగర్ ఉపఎన్నిక బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ పానుగోతు రవికుమార్‌ను అధిష్టానం ఖరారు చేసింది. తీవ్ర ఉత్కంఠ నేపథ్యంలో ఎట్టకేలకు రవికుమార్‌ను ఫైనల్ చేసింది. వాస్తవానికి మొదటి నుంచి టీఆర్ఎస్ నుంచి బలమైన అభ్యర్థిని లాక్కోవాలని ప్రయత్నించింది. కానీ ఆ ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో పాటు చివరకు డాక్టర్ రవికుమార్ వైపు మొగ్గు చూపింది.
అయితే కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, టీఆర్ఎస్ నుంచి నోముల భగత్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో బీజేపీ అనుహ్యంగా కొత్త అభ్యర్థి పేరును తెరపైకి తీసుకొచ్చింది. గత కొంతకాలంగా రవికుమార్ పేరు విన్పిస్తున్నా.. సామాజిక సమీకరణాల నేపథ్యంలో యాదవ్ లేదా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన క్యాండేట్‌ను నిలబెడతారని అంతా భావించారు. కానీ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు భిన్నంగా గిరిజన నేతకు బీజేపీ పట్టం కట్టడం ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశమయ్యింది. సాగర్ బీజేపీ అభ్యర్థిగా రవికుమార్ రేపు నామినేషన్ వేయనున్నారు. నామినేషన్లకు మంగళవారమే చివరి రోజు. దీంతో సాగర్ ఉపఎన్నిక పోరు రసవత్తరంగా మారనుంది.
రవికుమార్ బయోడేటా..
పూర్తి పేరు : పానుగోతు రవికుమార్
స్వగ్రామం: పలుగు తండా, త్రిపురారం మండలం
పుట్టిన తేదీ: 09-06-1985
భార్య: పానుగోతు సంతోషి
తల్లిదండ్రులు: పానుగోతు హరి, పానుగోతు దస్సి
పిల్లలు: మనస్వీత్, వీనస్
విద్యార్హతలు: ఎంబీబీఎస్
వృత్తి: ప్రభుత్వ వైద్యుడు (ప్రస్తుతం రాజీనామా)
పలు ఆస్పత్రుల్లో సివిల్ సర్జన్ గా ఉద్యోగ బాధ్యతలు.
నిర్మల ఫౌండేషన్ చైర్మన్, పలు మండలాల్లో సామాజిక కార్యక్రమాలు నిర్వహణలోనూ ముందంజలో ఉన్నారు.