రేషన్ పంపిణీ 76 శాతం పూర్తి

by Shyam |
రేషన్ పంపిణీ 76 శాతం పూర్తి
X

దిశ, మెదక్: లాక్ డౌన్ నేపథ్యంలో పేద ప్రజలకు 12కిలోల చొప్పున అందిస్తున్న ఉచిత రేషన్ బియ్యం పంపిణీ.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 76శాతం పూర్తయిందని సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే మిగిలిన వారికీ అందిస్తామని తెలిపారు. అలాగే, ఆర్థిక సాయం కింద ఇవ్వనున్న రూ.1500లు రెండు రోజుల్లో లబ్దిదారుల ఖాతాల్లో వేస్తామన్నారు. పంట కొనుగోళ్లకు గన్నీ బ్యాగ్‌ల కొరత ఉన్నందున రాష్ట్రంలో ఉన్న 17,200 రేషన్ షాపుల నుంచి గన్నీ బ్యాగులను తిరిగి ఇవ్వాలని డీలర్లను కోరినట్టు తెలిపారు. దీంతో సుమారు 60-70 లక్షల సంచులు రానున్నట్టు వెల్లడించారు. బ్యాగులను పంపని రేషన్ డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags: ration supply, mareddy srinivasa reddy, medak, 12kgs rice, corona, virus, lockdown,



Next Story

Most Viewed