శ్రీదేవి లేక సౌందర్య.. బయోపిక్‌పై రష్మిక ఇంట్రెస్ట్!

దిశ, వెబ్‌డెస్క్ : ప్రెట్టీ గర్ల్ రష్మిక మందన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. క్యూట్ లుక్స్‌తో నెటిజన్లను ఆకట్టుకునే భామ.. ఈ మధ్య పెట్స్‌తో ఎంజాయ్ చేస్తున్న పిక్స్ షేర్ చేయగా, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే, రష్మిక.. అందరు హీరోయిన్స్ మాదిరిగా ఫ్యాన్స్‌ను ప్రశ్నలు అడగమని చెప్పకుండా.. తానే కొన్ని ఆప్షన్స్ ఇచ్చి, అందులో తనకేది ఇష్టమో గెస్ చేయాలని అభిమానులను కోరుతోంది.

ఈ క్రమంలోనే నచ్చిన ఐస్ క్రీమ్, నచ్చిన స్వీట్ గురించి అడిగిన రష్మిక.. తనకున్న ఓ ఇంట్రెస్ట్ గురించి చెప్పకనే చెప్పింది.. అదే బయోపిక్. అవును ఈ మధ్య బయోపిక్‌ల హవా నడుస్తుండటం.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుండటంతో స్టార్స్ కూడా బయోపిక్‌లపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పైగా ‘మహానటి’ సినిమాతో కీర్తి సురేష్ ఏకంగా నేషనల్ అవార్డ్ కొట్టేయడంతో.. రష్మిక కూడా అలాంటి బయోపిక్ చేయాలనుకుంటోంది. ఈ క్రమంలోనే అతిలోక సుందరి శ్రీదేవి లేక అందాల తార సౌందర్య బయోపిక్.. వీటిలో ఏ బయోపిక్ చేస్తే బాగుంటుంది? అని అభిమానులను అడిగింది. మరి డైరెక్టర్లు ఈ క్వశ్చన్ ద్వారా రష్మిక చూపిస్తున్న ఇంట్రెస్ట్‌ను క్యాచ్ చేసి, బయోపిక్‌ను తెర మీదకు తీసుకెళ్తారేమో చూడాలి.

Advertisement