రష్మిక చేతిలో మరో మెగా ప్రాజెక్ట్?

దిశ, వెబ్‌డెస్క్:

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ఆచార్య. రామ్ చరణ్ తేజ్ మరో కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా.. ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ చేసింది. చిరుకు జోడీగా ఇప్పటికే కాజల్ అగర్వాల్ ఫైనల్ కాగా.. చరణ్‌తో జతకట్టున్న భామ ఎవరన్న దానిపై చర్చ జరుగుతోంది.

ఆ అవకాశం చెర్రీ ఫ్రెండ్ కియారా అద్వానీకి దక్కుతుందని ముందుగా వార్తలు వినిపించినా.. తాజాగా కన్నడ బ్యూటీ రష్మిక మందన్న పేరు వినిపిస్తోంది. ఇప్పటికే రష్మిక.. మెగా హీరో అల్లు అర్జున్‌తో ‘పుష్ప’ సినిమాలో జతకడుతుండగా, ఈ మెగా ప్రాజెక్ట్ కూడా తనే చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ను ఎంజాయ్ చేస్తున్న భామ ఇప్పటికే వరుస హిట్లతో ఫామ్‌లో ఉండగా.. ఈ రెండు ప్రాజెక్ట్‌లు కూడా సక్సెస్ అయితే టాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్ అవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న ఆచార్యకు మణిశర్మ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement