నీ వీడియో మోడీ అంకుల్ చూడాల్సిందే బాబు..

by Jakkula Samataha |
నీ వీడియో మోడీ అంకుల్ చూడాల్సిందే బాబు..
X

రష్మి గౌతమ్… జబర్దస్త్ యాంకర్. పైకి రౌడీ పిల్లలా కనిపించినా… మనసు మాత్రం చాలా మంచిది. ఒకరికి కష్టం వస్తే వెంటనే కన్నీరు పెట్టుకుంటుంది. వారిని ఆదుకునేందుకు ముందుంటుంది. ముఖ్యంగా మూగ జీవులు బాధపడితే అసలు తట్టుకోలేదు. అందుకే లాక్ డౌన్ సమయంలో ఆకలితో అలమటించే వీధి కుక్కలకు ఆహారం అందిస్తోంది. ఇదిలా ఉంటే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే భామ… ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ట్యాగ్ చేస్తూ షేర్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.

వీడియోలో చిన్న బాబు తన తల్లితో మాట్లాడే మాటలు అందరినీ ఆలోచించేలా చేస్తున్నాయి. తల్లి ఇంటి నుంచి బయటకు వెళదామని అడిగితే … వద్దు మోడీ అంకుల్ చెప్పా డుగా అలా చేయొద్దని చెప్తాడు. పర్లేదు అలా వెళ్లి వద్దామని తల్లి ఫోర్స్ చేస్తుంటే… నో… అలా వెళ్తే ప్రభుత్వం నన్ను తీసుకెళ్తుంది అంటూ బుజ్జి బుజ్జి మాటలతో సందేశాన్ని ఇచ్చాడు. దీంతో నీ మాటలు మోడీ అంకుల్ వినాల్సిందే అని… ఎంత క్యూట్ గా ఉన్నావ్… అవును బాబు లాక్ డౌన్ సమయంలో మనం బయటకు వెళ్ళోద్దు.. మోడీ అంకుల్ చెప్పారు కదా అంటూ ఈ పోస్ట్ పెట్టింది రష్మి.ఈ వీడియోను చూసిన ప్రముఖులు ఆనందంగా ఉందంటున్నారు. నెక్స్ట్ జనరేషన్ రూల్స్ గురించి, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతుండడం సంతోషంగా ఉందని చెప్తున్నారు.

Tags : Rashmi Gowtham, jabardast, Anchor, PM Modi, Baby Video


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed