- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంబ్లీకి పాక్ అభిమాని లేఖలు ఎలా పంపేవాడంటే..
దిశ, స్పోర్ట్స్: ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎంత పోటాపోటీగా ఉంటుందో తెలిసిందే. ఆ మ్యాచ్ జరుగుతున్న స్టేడియం యుద్ధమైదానాన్ని తలపిస్తుంటుంది. అభిమానుల్లోనూ అదే ఉత్కంఠ ఉంటుంది. అయితే, ఆడేటప్పుడు ఎంత పోటీపడినా బయట మాత్రం ఇరు జట్ల క్రికెటర్లు చాలా స్నేహపూర్వకంగా ఉంటారని మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ అన్నాడు. తనకు పాకిస్తాన్ జట్టులో ఎంతో మంది స్నేహితులు ఉన్నారని చెప్పాడు. అలాగే, కరాచీలో ఒక వీరాభిమాని ఉండేవాడని, 1991 నుంచి తనను ఫాలో అవుతున్న ఆయన, ఎప్పుడైనా పాకిస్తాన్ వెళ్తే చక్కని ఆతిథ్యం కూడా ఇచ్చేవాడని తెలిపాడు. ‘అప్పట్లో మొబైల్ ఫోన్స్ ఉండేవి కావు. అందుకే తన భావాలన్నింటినీ లేఖలో రాసేవాడు. పాక్ జట్టు ఆటగాడు రషీద్ లతీఫ్‌కు ఆ లేఖలు ఇచ్చి తనకు ఇవ్వాలని చెప్పేవాడు. పాకిస్తాన్, ఇండియా పర్యటనకు వచ్చినప్పుడు లతీఫ్ ఆ ఉత్తరాలు నాకు ఇచ్చేవాడు’ అని కాంబ్లీ చెప్పాడు.