కోడి గుడ్డంత వజ్రం.. ధరెంతంటే?

by Anukaran |   ( Updated:2020-09-12 06:33:01.0  )
కోడి గుడ్డంత వజ్రం.. ధరెంతంటే?
X

దిశ, వెబ్‌డెస్క్:

ఎన్నో కఠిన ఒత్తిడులకు గురై తయారవుతుంది కాబట్టి దానికి అంత విలువ ఉంటుంది. అలాంటి వజ్రం ఒకదాన్ని త్వరలో వేలం పాటకు పెట్టబోతున్నట్లు ప్రముఖ ఆక్షన్ సంస్థ సూథ్‌బై వెల్లడించింది. ఈ వజ్రం ప్రత్యేకతల గురించి వివరిస్తూ.. ఇది కోడిగుడ్డంత సైజులో ఉంటుందని, చాలా అరుదైనదని తెలిపింది. అలాగే 2018లో కెనడియన్ ప్రావిన్స్ ఒంటారియోలోని వజ్రాల గనిలో దొరికిన 271 కేరెట్ల రఫ్ నుంచి కోసి తీసినట్లు ప్రకటించింది.

ఇది 102.39 కేరేట్ల వజ్రమని, ఇప్పటి వరకు ఉన్న అతిపెద్ద వజ్రాల్లో ఇది రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉన్న వజ్రం 118.28 కేరెట్లు ఉందని కూడా సూథ్‌బై తెలిపింది. ఎలాంటి దోషాలు లేకుండా పూర్తిగా తెలుపు రంగులో మెరుస్తూ, 100 కేరెట్ల కంటే ఎక్కువ ఉన్న వజ్రాలు కేవలం ఏడు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటైన ఈ వజ్రాన్ని వచ్చే నెలలో వేలానికి పెట్టబోతున్నారు. దీని ధర 12 మిలియన్ డాలర్ల నుంచి 30 మిలియన్ డాలర్ల వరకు పలకవచ్చని సూథ్‌బై అభిప్రాయపడుతోంది.

Advertisement

Next Story

Most Viewed