డ్రగ్స్ ఇచ్చి.. భార్యతో కలిసి లైంగిక వేధింపులు

by Jakkula Samataha |
డ్రగ్స్ ఇచ్చి.. భార్యతో కలిసి లైంగిక వేధింపులు
X

దిశ, సినిమా : అమెరికన్ రాపర్ టి.ఐ(క్లిఫోర్డ్ హారిస్), సింగర్ తమెకా హారిస్‌ దంపతులపై లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్(ఎల్‌ఎపిడి) దర్యాప్తు ప్రారంభించింది. తమకు డ్రగ్స్ ఇచ్చి లైంగికంగా వేధించారంటూ ఇద్దరు మహిళలు ఎల్‌ఎపిడి, లాస్ వెగస్ మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు ఫిర్యాదు చేయగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.

కాగా 11 మంది బాధితుల తరపున ప్రాతినిధ్యం వహించిన న్యాయవాది టైరోన్ బ్లాక్‌బర్న్.. రాపర్ తన భార్యతో కలిసి లైంగిక వేధింపులతో పాటు కిడ్నాప్, బెదిరింపులకు కూడా పాల్పడ్డాడని మార్చిలో ఆరోపించాడు. దేశవ్యాప్తంగా మహిళలను టార్గెట్ చేస్తూ 15 ఏళ్లుగా ఇద్దరూ కలిసి నేరాలకు పాల్పడుతూనే ఉన్నారని వివరించాడు. కనీసం ఇప్పుడైనా ఎల్ఎపిడి క్రియాశీల దర్యాప్తు చేపట్టడం మంచి పరిణామమని అభిప్రాయపడ్డాడు.

Advertisement

Next Story

Most Viewed