- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆధార్ కార్డులో పేర్లు మార్చుతానని తల్లీకూతురుపై అత్యాచారం
దిశ, వెబ్‌డెస్క్ : ఒంటరిగా ఆడది కనిపిస్తే చాలు.. కామంతో బుస కొడుతున్నారు కామాంధులు. వయసు, వరసలతో సంబంధం లేకుండా కుక్కల్లా మీదపడి కోరిక తీర్చుకుంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఇంటి ఓనర్ అద్దెకు దిగిన మహిళలను, ఆమె మైనర్ కూతురుపై అత్యాచారం చేశాడు. విషయం బయట చెప్పినందుకు శిక్షగా అతడి కొడుకు సైతం అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మనసు కదిలేలా ఉన్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతానికి చెందిన మహిళ 12 ఏళ్ల కూతురుతో కలిసి ఒంటరిగా ఉంటుంది. ఆమె ఆధార్ కార్డులో వివరాలు మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన సూరజ్ రాయ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తాను ఆధార్ కార్డులో వివరాలు మార్చడానికి సహాయం చేస్తానని నమ్మబలికాడు. ఈ క్రమంలోనే తన ఇంట్లో పోర్షన్ ఖాళీగా ఉన్నదని, అద్దెకు దిగాలని కోరాడు. దీంతో ఆ మహిళ మూడు నెలల క్రితం సూరజ్ రాయ్ ఇంట్లో అద్దెకు దిగింది. అప్పటి నుంచి ఆమెపై కన్నేసిన ఇంటి ఓనర్ అదును కోసం ఎదురు చూస్తున్నాడు. ఇదేమి తెలియని మహిళ ఓ రోజు స్నానం చేసి జుట్టు తూడుచుకుంటూ స్లాబ్ పైకి వెళ్లింది. అది గమనించిన సూరజ్ రాయ్ ఆమెను బలవంతంగా ఇంట్లోకి లాకెళ్లి అత్యాచారం చేశాడు.
ఆ షాక్ నుంచి మహిళ తేరుకునే లోపే ఆ ఇంటి ఓనర్ మరో ఘాతుకానికి పాల్పడ్డాడు. మహిళ ఇంట్లో లేని సమయంలో ఆమె 12 ఏళ్ల కూతురుపై కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆగ్రహం చెందిన మహిళ చుట్టుపక్కల వాళ్లకు విషయం చెప్పి న్యాయం చేయాలని కోరింది. దీంతో సూరజ్ రాయ్ కొడుకు తమ ఇంటి పరువు తీస్తున్నావని ఆమెను గదిలో బంధించి అత్యాచారం చేశాడు. వారి చర నుంచి తప్పించుకున్న మహిళ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ పర్వీందర్ సింగ్ మీడియాకు వెల్లడించారు. తల్లీకూతురును వైద్య పరీక్షలకు తరలించారు. కేసు విచారణ కొనసాగుతోందని, త్వరలోనే సూరజ్ రాయ్, ఆయన కుమారుడిని అరెస్ట్ చేస్తామని డిప్యూటీ పోలీస్ కమిషనర్ పర్వీందర్ సింగ్ తెలిపారు.