- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రూ.5 వేల కోసం వెళ్తే.. స్వీట్ షాప్‌లో అత్యాచారం
దిశ, వెబ్‌డెస్క్ : ఉద్యోగిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన యజమాని కామాంధుడిలా మారాడు. కుటుంబానికి ఆసరాగా ఉంటానని వచ్చిన అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఒంటరిగా ఉన్న యువతిపై షాప్‌లోనే దారుణానికి ఒడిగట్టాడు. ఏపీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ప్రస్తుతం లాక్‌డౌన్ కావడంతో కాలేజీలు మూసివేశారు. అయితే ఇంట్లో ఖాళీగా ఉండలేక కుటుంబానికి ఆసరాగా ఉంటుందనే ఉద్దేశ్యంతో పట్టణంలోని ఓ స్వీట్ షాప్ లోరూ.5వేల వేతనానికి పనిలో చేరింది. ఆ యువతిపై కన్నేసిన స్వీట్ షాప్ యజమాని.. షాపులో ఎవరు లేని సమయంలో కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చాడు.
యజమాని ప్రేమగా ఇస్తున్నాడని అనుకున్న యువతి దానిని తాగిన కొద్దిసేపట్లోనే మత్తులోకి జారుకుంది. ఆమెపై యజమాని షాపులోనే అత్యాచారం చేశాడు. ఆ తర్వాత స్పృహలోకి వచ్చిన యువతి తనపై అత్యాచారం జరిగినట్టు గుర్తించింది. వెంటనే వెళ్లి కుటుంబ సభ్యులకు విషయం తెలిపింది. వారి ఫిర్యాదు మేరకు పొన్నూరు పోలీసులు కేసు నమోదు చేశారు.