- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మైనర్ బాలికపై ఆటోడ్రైవర్ల అఘాయిత్యం.. నగరశివారులో నాలుగు రోజులు..?
దిశ ప్రతినిధి, హైదరాబాద్: మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన ఆటో డ్రైవర్లు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టిన దారుణ సంఘటన సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కాచిగూడ ప్రాంతానికి చెందిన ఓ బాలిక (17) సుల్తాన్ బజార్ పీఎస్ పరిధిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. గత నెల 30వ తేదీన ఇంటి నుండి కాలేజీకు వెళ్లిన ఆమె కనిపించకుండా పోయింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో తమ కూతురు మిస్సింగ్ పై ఫిర్యాదు చేశారు. బాలిక మైనర్ కావడంతో పోలీసులు వెంటనే కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.
ఇదిలా ఉండగా సదరు బాలిక చాదర్‌ఘాట్‌లో ఉన్నట్లు తెలుసుకుని ఈ నెల 3వ తేదీన ఆమెను తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలిక కనబడకుండా పోయిన నాలుగు రోజులు ఎక్కడుందని ఆరా తీసిన పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెపై అత్యాచారం జరిగినట్లు గుర్తించారు. ప్రతి రోజు కాలేజీకు వెళ్లే సమయంలో అమ్మాయికి ఆటో డ్రైవర్లతో పరిచయం ఏర్పడినట్టు తెలుస్తోంది. ఈ పరిచయంతోనే మైనర్ వారి వెంట వెళ్లినట్టు సమాచారం.
ఇదే అదునుగా భావించిన ఆటో డ్రైవర్లు నగర శివారు ప్రాంతంలోకి తీసుకెళ్లి ఒకరికి తెలియకుండా మరొకరు బాలికపై అత్యాచారం చేశారు. ఇదే విషయాన్ని సదరు బాలిక పోలీసులకు తెలియజేయడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికను భరోసా సెంటర్‌కు తరలించారు. బాలికపై అత్యాచారం చేసిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేయగా.. మరొకరిని పట్టుకోవాల్సి ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు.