ఒంటరైన పశువుల కాపరి.. బరితెగించిన గొర్రెల కాపరి!

by Mahesh |   ( Updated:2021-07-06 03:58:07.0  )
ఒంటరైన పశువుల కాపరి.. బరితెగించిన గొర్రెల కాపరి!
X

దిశ, వెబ్‌డెస్క్ : కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ గొర్రెల కాపరి తోటి మహిళా పశువుల కాపరిపై దారుణానికి ఒడిగట్టాడు. ఉదయం పశువులను మేపేందుకు వెళ్లిన ఒంటరి మహిళపై అత్యచారయత్నం చేశాడు. ఈ ఘటన అనంతరపురం జిల్లా పామిడి మండలం పాడియత్ తండాలో మంగళవారం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. స్థానిక తండాకు చెందిన బాబునాయక్ గొర్రెలు కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే తండాకు ఓ మహిళ పశువులను మేపేందుకు స్థానికంగా గల ప్రదేశానికి ఒంటరిగా వెళ్లింది. అది గమనించిన బాబు నాయక్ ఆమెను బలవంతం చేయబోయాడు.

ఆ మహిళ గట్టిగా కేకలు వేయడంతో తోటి కాపరులు వెంటనే అక్కడకు చేరుకునేలోపే బాబునాయక్ పారిపోయాడు. అతన్ని బాగోతాన్ని పశువుల కాపరి ఒకరు మొబైల్‌లో చిత్రీకరించారు. సమాచారం అందడంతో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story