- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పాద్రయాత చేసి సోనూసూద్‌ను కలిసిన రంగారెడ్డి యువకుడు
దిశ, పరిగి : దోమ మండలం దోర్నాలపల్లికి చెందిన యువకుడు వెంకటేష్.. రియల్ హీరో సోనూసూద్‌ను గురువారం కలిశాడు. సోనూసూద్ చేస్తున్న సేవా కార్యక్రమాలు, కరోనా బాధితులకు చేస్తున్న సహాయానికి వెంకటేష్ ప్రేరణ పొందాడు. ఈ నేపథ్యంలో సోనూసూద్‌ను కలవాలనుకొని మే 31న వెంకటేష్.. హైదరాబాద్ నుంచి ముంబైకు పాదయాత్రగా బయలుదేరాడు. హైవే మీదుగా ముంబై వెళ్తున్న వెంకటేష్ 9 రోజులు ప్రయాణం చేసి సోలాపూర్‌కు చేరుకున్నాడు.
అక్కడి నుంచి ముంబైకు ఇంకా 300 కిలోమీటర్లు పాదయాత్ర చేయాల్సి ఉండగా.. వెంకటేష్‌కు సోనూసూద్ ఫోన్ చేసి తాను కారు పంపిస్తున్నానని పాదయాత్ర ఆపేయాలని కోరాడు. దీంతో సోనూ పంపించిన కారులో వెంకటేష్ ముంబైకి చేరుకున్నాడు. అనంతరం వెంకటేష్‌కు సోనూసూద్ అక్కడే ఓ హోటల్లో బస ఏర్పాటు చేశాడు. గురువారం వెంకటేష్‌ను సోనూ ఇంటికి పిలిపించుకొని కలిశాడు.
ఈ సందర్భంగా వెంకటేష్ కుటుంబ సభ్యుల గురించి తెలుసుకున్నాడు. తన తండ్రి అంజిలయ్యకు వ్యవసాయం ఉందని.. వ్యవసాయానికి అనుబంధంగా పాడి పశువులను కూడా సాకి ఆర్థికంగా ఎదుగాలని అనుకుంటున్నట్టు సోనూసూద్‌కు వెంకటేష్ సూచించాడు. దీంతో తన తండ్రికి గేదెలు ఇప్పిస్తానని వెంకటేష్‌కు సోనూ హామీ ఇచ్చాడు. పాడి గేదె పాలతో తయారైన స్వీటును కూడా తనకు తెచ్చి ఇవ్వాలని నవ్వుతూ వెంకటేష్ భుజం తట్టాడు సోనూసూద్. అయితే.. వెంకటేష్ తిరుగు ప్రయాణానానికి కూడా సోనూసూద్ ఏర్పాటు చేస్తున్నట్లు వెంకటేష్ తెలిపారు.