- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాబోయే రోజుల్లో జాగ్రత్త: స్వర్ణలత
దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరలో కీలక ఘట్టం ‘రంగం’లో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఎవరు చేసుకున్న దానికి వారు అనుభవించక తప్పదని స్వర్ణలత భవిష్యవాణిలో తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కరోనా కట్టడి చేసేందుకు తాను ఉన్నానని స్వర్ణలత భవిష్యవాణిలో గుర్తు చేశారు.
కానీ, తనకు మాత్రం సంతోషం కలుగలేదని చెప్పుకొచ్చారు. ప్రజలు ఈ స్థితిలో ఉండాటం ఎంతో బాధ కలిగిస్తోందని చెప్పారు. ప్రజలందరినీ కాపాడుతానని.. కానీ, రాబోయే రోజుల్లో కష్టాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. భక్తి భావంతో అమ్మవారిని కొలిస్తే కాపాడుతానని భవిష్యవాణిలో వినిపించారు. గంగాదేవికి పూజలు జరిపించినట్లు అయితే సంతోషంతో మీరు కోరుకున్నది తప్పక నెరవేరుస్తుందన్నారు. తనకు 5 వారాల పాటు సాక పోస్తూ.. పప్పు, బెల్లం వంటి వాటిని సమర్పించాలని.. ప్రతి గడప నుంచి తనకు మొక్కులు చెల్లించాలి అని చెబుతూనే.. ఈ మహమ్మారి నుంచి అందరినీ కాపాడుతానని స్వర్ణలత భవిష్యవాణి ముగించారు.