పసుపు దుస్తుల్లో మెరిసిపోతున్న రానా ప్రేయసి

by  |
పసుపు దుస్తుల్లో మెరిసిపోతున్న రానా ప్రేయసి
X

భల్లాల దేవుడి బ్యాచిలర్ లైఫ్ మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఇప్పటికే తన స్నేహితులు.. చైతు, చెర్రి, నితిన్‌, నాని పెళ్లి చేసుకోగా.. ఇప్పుడు రానా కూడా వాళ్ల బ్యాచ్‌లో చేరిపోనున్నాడు. రామానాయుడు స్టూడియోలో ఆగస్టు 8న రానా తన ప్రేమికురాలు మిహికా మెడలో మూడుముళ్లు వేయనున్న సంగతి తెలిసిందే. ముహూర్త శుభ ఘడియలు దగ్గర పడుతుండటంతో.. ఇరు కుటుంబాల్లో పెళ్లి సందడి మొదలైంది. రానా ప్రేయసి, కాబోయే శ్రీమతి మిహికా బజాజ్ హల్దీ వేడుకలో మెరిసిపోయింది. ఎల్లో గ్రీన్ లెహెంగాలో తను బ్యూటీఫుల్‌గా కనిపిస్తుండగా, రాణా పట్టుబట్టల్లో తళుక్కుమన్నాడు. హల్దీ వేడుక సందర్భంగా ప్రత్యేక సీ షెల్స్ డిజైనర్ ఆభరణాలతో మిహికా చూపరులను ఆకట్టుకుంది. కాగా, ఈ డ్రెస్‌ను డిజైనర్ ఆనంద్ కబ్రా రూపొందించారు. ఇక హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ హల్దీ వేడుకలో రానా, మిహికా.. ఒకరి కళ్లలో మరొకరు చూసుకుంటున్న ఫొటో అందరినీ ఆకట్టుకుంటోంది.

ఆగస్టు 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు చైతన్య ఎన్‌క్లేవ్, ఖాజాగూడ, మణికొండ, హైదరాబాద్‌లో రానా- మిహికా వివాహం జరుగుతుందని పత్రిక ద్వారా వెల్లడించారు. కరోనా సమయంలో జరుగుతున్న పెళ్లి కావడంతో ఈ వివాహ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఈ పెళ్లి జరగనుంది. అతిథులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాటు చెఫ్‌లు, సర్వర్‌లను కూడా పరీక్షిస్తున్నామని, కరోనా ప్రోటోకాల్ ప్రకారం వారందరూ ఐసోలేషన్‌లో ఉన్నట్టు రానా తండ్రి సురేష్ బాబు వెల్లడించారు.

https://www.instagram.com/p/CDippcbJE_v/


Next Story

Most Viewed