ఒక శకం ముగిసింది: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణవార్త కలచివేసిందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు. ‘ప్రణబ్ మరణంతో ఒక శకం ముగిసింది. భారత మాతకు ఆయన శక్తియుక్తుల సేవలందించారు. విలువైన పుత్రుడిని కోల్పోయామని దేశం దు:ఖిస్తున్నది. ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులు, పౌరులకు సానుభూతి’ అని పేర్కొన్నారు.

ప్రథమ పౌరుడిగా ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి భవన్‌ను ప్రజలకు చేరువ చేశారని, ప్రజల సందర్శనకు ద్వారాలు తెరిచారని రాష్ట్రపతి తెలిపారు. ఆయన ఘనత చారిత్రాత్మకమని వివరించారు. సంస్కృతి, ఆధునికత మేళవించినట్టుండే ప్రణబ్ ముఖర్జీ మేధస్సు అమోఘమని, ఐదు దశాబ్దాల తన రాజకీయ చరిత్రలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన నిలుచున్న నేలను వదల్లేదని ట్వీట్ చేశారు.

Advertisement