‘దిశ ఎన్‌కౌంటర్‌ను ఆపండి’

by Shyam |   ( Updated:2020-11-03 07:39:39.0  )
‘దిశ ఎన్‌కౌంటర్‌ను ఆపండి’
X

దిశ, వెబ్‌డెస్క్: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న దిశ ఎన్‌కౌంటర్ చిత్రం పై మరోసారి పిటిషన్ దాఖలు అయింది. దిశ తండ్రి చిత్రాన్ని నిలిపివేయాలంటూ హైకోర్టు మెట్లు ఎక్కారు. ఈ నేపథ్యంలోనే రిట్ అప్పీల్ పిటిషన్ వేశారు. దిశ పై తీస్తున్న చిత్రం తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందన్నారు. మా కూతురు ఘటనను చిత్రంలో చూపిస్తూ.. మహిళలను కించపరచడం లేదని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో అయినా చిత్రాన్ని విడుదల చేయకుండా అడ్డుకుంటామన్నారు. చిత్రాన్ని నిలివేశామని ప్రకటన వెలువడే వరకు న్యాయం పోరాటం చేస్తామని దిశ తండ్రి స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed