ఉపాధ్యాయుల స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలి : పీఆర్టీయూ

by Shyam |
teacher
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: ఉపాధ్యాయుల స్థానికతను పరిగణలోకి తీసుకోవాలని పీఆర్టీయూ టీఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామేశ్వర్ గౌడ్ శుక్రవారం కార్యవర్గ సమావేశంలో జోనల్ విధానం, బదీల అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పనిచేస్తున్న స్థానిక ఉపాధ్యాయులు వారి స్థానికతను పరిగణలోకి తీసుకుని జిల్లాకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన 317 జీవోకు సవరణలు చేయాలని కోరారు. నాన్ లోకల్ కోటాను మూడు జిల్లాలకు సమానంగా పంచాలని విజ్ఙప్తి చేశారు. వితంతువులకు, భార్యాభర్తలకు జిల్లా కేటాయింపు సమయంలో ప్రాధాన్యత కల్పించాలని అన్నారు. భవిష్యత్తులో అన్ని జిల్లాలకు సమానంగా నియమకాలు, పదోన్నతలు వచ్చే విధంగా దామాషా పద్దతిని పాటించాలని కోరారు. ఈ సమావేశంలో మల్కాజ్గిరి, అల్వాల్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నర్సింహ్మారెడ్డి, శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed