- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Baba Ramdev: వాళ్లే కాదు, వాళ్ల అయ్యలు కూడా నన్ను అరెస్టు చేయలేరు- బాబా రామ్‌దేవ్
న్యూఢిల్లీ: ఆధునిక వైద్యం శాస్త్రంపై యోగా గురువురు రామ్‌దేవ్ చేసిన వ్యాఖ్యల వివాదం ముగియకముందే నెట్టింట మరో వీడియో రచ్చ చేస్తున్నది. తనను అరెస్టు చేయాలన్న డిమాండ్‌పై తాజా వీడియోలో ఆయన స్పందించారు. వాళ్లే కాదు.. వాళ్ల అయ్య కూడా నన్ను అరెస్టు చేయలేరని అన్నారు. అల్లోపతి, అల్లోపతిక్ డాక్టర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తర్వాత అరెస్ట్ రామ్‌దేవ్ హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. దీనిపై రామ్‌దేవ్ మాట్లాడుతూ..”వాళ్లంతా కేవలం హడావిడీ చేస్తుంటారు. రామ్‌దేవ్ బందిపోటు, అరెస్టు చేయాలి.. లాంటి అంశాలను ట్రెండ్ చేస్తుంటారు. అరెస్టు వాళ్లే కాదు, వాళ్ల అయ్యలూ చేయలేరు” అని పేర్కొన్నారు.
Ramdev challenges Modi Govt into arresting him, says “UNKA BAAP BHI ARREST NAHI KAR SAKTA”
Ramdev challenges Modi Govt into arresting him, says "UNKA BAAP BHI ARREST NAHI KAR SAKTA"
Over to you, @narendramodi @AmitShah !!
— Gaurav Pandhi (@GauravPandhi) May 25, 2021
కరోనా మహమ్మారిలో ముందుండి పోరాడుతున్న వైద్యులు, శాస్త్రీయ వైద్యంపై చేసిన తప్పుడు వ్యాఖ్యానాలపట్ల ఆయన క్షమాపూర్వకంగా లేరని ఈ వీడియో తెలియజేస్తున్నదని, ఆయన వ్యాఖ్యలు దురహంకారాన్ని సూచిస్తున్నాయని డెహ్రాడూన్‌కు చెందిన వైద్యులు అన్నారు. తాను చట్టానికీ అతీతుడని భావిస్తున్నట్టు కనిపిస్తున్నదని ఆరోపించారు. కరోనా వ్యాక్సినేషన్, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కొవిడ్ ట్రీట్‌మెంట్ ప్రొటోకాల్స్‌కు విరుద్ధంగా మాట్లాడిన రామ్‌దేవ్ బాబాపై వెంటనే దేశద్రోహం కేసు పెట్టాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధానమంత్రి మోడీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. అల్లోపతిపై అవమానకర రీతిలో మాట్లాడారని పేర్కొంటూ 15 రోజుల్లో క్షమాపణలు చెప్పాలని లేదంటే రూ. 1000 కోట్ల పరువునష్టం చెల్లించాలని ఉత్తరాఖండ్ ఐఎంఏ విభాగం దావా వేసింది.