‘రామాయణ్‌’కు భారీ క్రేజ్

by Shamantha N |
‘రామాయణ్‌’కు భారీ క్రేజ్
X

దూరదర్శన్‌లో పున: ప్రసారమవుతున్న రామాయణం సీరియల్‌కు హిందీ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ మేరకు భారత ప్రసార మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. 1987లో విశేష ప్రజాధారణ పొందిన రామాయణం సీరియల్ నేటికి ఆదరణ ఏమాత్రం చెక్కుచెదరలేదు. దేశంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రధానీ మోడీ 21 రోజులపాటు లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చారు. ప్రజలందరూ ఇంటికే పరిమితం అయ్యేలా మార్చి 28 నుంచి దూరదర్శన్‌లో పున: ప్రసారం చేస్తున్నారు. ఈ సీరియల్ ప్రారంభించిన కేవలం వారం రోజుల్లోనే హిందీలో సుమారు 1కోటీ 70 లక్షల మంది వీక్షించినట్టు దూరదర్శన్ సీఈవో శషి శేఖర్ వెల్లడించారు.

Tags: central telcom minister,doordarshan,ramayan,highest ratings



Next Story

Most Viewed