రీ ఎంట్రీలో రికార్డులు సృష్టిస్తున్న రామాయణ్

by Shyam |
రీ ఎంట్రీలో రికార్డులు సృష్టిస్తున్న రామాయణ్
X

దిశ, వెబ్‌డెస్క్:
మూడు దశాబ్దాల కిందటి రామాయణ్ టీవీ సీరియల్‌ను 21 రోజుల కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో దూరదర్శన్‌లో పునః ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. గతవారం ప్రసారం చేసిన నాలుగు ఎపిసోడ్లు రికార్డు సంఖ్యలో వీక్షణలు అందుకున్నాయని బ్రాడ్‌కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) వెల్లడించింది. మొత్తంగా 172 మిలియన్ల మంది వీక్షించారని ప్రకటించింది.

దీంతో ఈ సీరియల్ కొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు హిందీ జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ కేటగిరీలో ఎక్కువ మంది చూసిన సీరియల్ ‌గా రికార్డుకెక్కింది. లాక్‌డౌన్ నేపథ్యంలో పాత హిట్ సీరియళ్లను ప్రసారం చేయాలని ప్రసార భారతి తీసుకున్న నిర్ణయాన్ని బార్క్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ లుల్లా కొనియాడారు. ఈ వీక్షణల రికార్డులతో ప్రకటనదారులు రామాయణ్ కోసం ఎగబడే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. శనివారం రోజున 34 మిలియన్ మంది, అదే రోజు రిపీట్ టెలికాస్టును 45 మిలియన్ మంది వీక్షించినట్లు బార్క్ వెల్లడించింది. ఇక ఆదివారం రోజున ఉదయం ఎపిసోడ్‌ను 40 మిలియన్ల మంది, సాయంత్రం ఎపిసోడ్‌ను 51 మిలియన్ల మంది వీక్షించారు.

Tags: Ramayan, Quarantine, BARC, Shaktimaan, Lockdown, Telecast

Advertisement

Next Story

Most Viewed