- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రామాయంపేట మాజీ ఎమ్మెల్యే ముత్యం రెడ్డి మృతి
దిశ ప్రతినిధి, మెదక్: రామాయంపేట మాజీ శాసన సభ్యుడు రాజయ్యగారి ముత్యం రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉదయం కన్ను మూశారు. రాజయ్యగారి ముత్యం రెడ్డి స్వస్థలం చిన్నశంకరం పేట మండలం కామారం గ్రామం. 1978 లో రామయంపేట ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యారు. అయితే 1980లో కాంగ్రెస్ హైకమాండ్ హఠాత్తుగా టీ.అంజయ్యను ముఖ్యమంత్రిగా నియమించడంతో, అంజయ్య కోసం ముత్యంరెడ్డి తన పదవిని త్యాగం చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా, జెడ్పీ చైర్మన్‌గా ప్రజలకు సేవలందించారు. వృద్ధాప్య సమస్యలతో చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటోన్న ఆయనకు కొద్దిరోజుల కిందట ఆరోగ్యం క్షీణించింది. రాజయ్యగారి ముత్యం రెడ్డి మరణంతో ఆయన స్వస్థలంలో విషాదం నెలకొంది. ముత్యం రెడ్డి మృతి పై కాంగ్రెస్ సహా పలు పార్టీల నేతలు విచారం వ్యక్తం చేశారు. కాగా ఆయన స్వగ్రామంలో నేటి సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించే అవకాశముంది.