స్టైలిష్‌గా రామ్ 'గార్నియర్ మెన్' యాడ్

by Shyam |
స్టైలిష్‌గా రామ్ గార్నియర్ మెన్ యాడ్
X

దిశ, వెబ్ డెస్క్ :

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఫస్ట్ టైం ఒక ప్రొడక్ట్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘ది గార్నియర్ మెన్‌’తో కలిసి పని చేస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపాడు. ఇందుకోసం జరిగిన షూటింగ్, డబ్బింగ్ చాలా ఫన్‌గా ఉందని చెప్పిన రామ్.. లాంగ్ టర్మ్ అసోసియేషన్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. కాగా బాలీవుడ్ హీరో జాన్ అబ్రహంతో కలిసి చేసిన యాడ్‌లో సూపర్ స్టైలిష్ అండ్ ఎనర్జిటిక్‌గా కనిపించాడు రామ్.

కాగా ప్రస్తుతం ‘రెడ్’ సినిమాతో థియేటర్‌లోనే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు ప్లాన్ చేశాడు రామ్. ఈ క్రమంలోనే డబ్బింగ్ పూర్తి చేసుకున్న రామ్.. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగానే ప్రమోషన్స్ గురించి ప్లాన్ చేస్తున్నాడని టాక్.

Advertisement

Next Story