అయోధ్య ట్రస్ట్ చైర్మన్‌కు కరోనా..

దిశ, వెబ్‌డెస్క్ :
అయోధ్య రామమందిరం ట్రస్ట్ చైర్మన్ నృత్యగోపాల్ దాస్‌కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని వైద్యులు సైతం ధృవీకరించారు. కాగా, ఇటీవలే ఆయన రామమందిరం నిర్మాణ భూమిపూజలో పాల్గొన్నారు.

అయితే, భూమిపూజ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాధ్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, పలువురు ప్రముఖులు, సాధువులు హాజరయ్యారు. ట్రస్ట్ చైర్మన్‌కు కరోనా పాజిటివ్ రావడంతో కేంద్రం, యూపీ అధికార యంత్రాంగం అప్రమత్తమైనట్లు సమాచారం.

Advertisement