ఇంట్రెస్టింగ్ న్యూస్.. శంకర్ మూవీలో చెర్రీ రోల్ ఏంటంటే?

by Shyam |
ramcharan, shankar
X

దిశ, సినిమా: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో పాన్ ఇండియా మూవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ హల్ చల్ చేస్తోంది. ‘మెర్సిల్, బిజిల్, సురారైపోట్రు, జగమే తంత్రం’ సినిమాలకు లిరిక్స్ అందించిన వివేక్ ఈ సినిమా ద్వారా స్క్రీన్ రైటర్‌గా మారబోతున్నారని తెలుస్తోంది.

స్క్రీన్ ‌ప్లే, డైలాగ్స్‌ విభాగాల్లో డైరెక్టర్‌కు సహాయంగా ఉండనున్నారు. టెక్నాలజీ, వీఎఫ్‌ఎక్స్ నుంచి బ్రేక్ తీసుకుంటూ ఈ సినిమా చేస్తున్న శంకర్.. చెర్రీని ఐఏఎస్ ఆఫీసర్‌గా చూపించబోతున్నారని సమాచారం. జూన్ / జూలైలో మూవీ సెట్స్ మీదకు వెళ్లనుండగా, ఆరు నెలల్లో ప్రాజెక్ట్‌ను కంప్లీట్ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత డైరెక్టర్ శంకర్.. రణ్‌‌వీర్ సింగ్‌తో కలిసి ‘అపరిచితుడు’ అడాప్టెడ్ ప్రాజెక్ట్‌తో బిజీ కానున్నారు.

Advertisement

Next Story