అఫిషియల్: రాంచరణ్-శంకర్ కాంబో ఫిక్స్

by Jakkula Samataha |   ( Updated:2021-02-12 07:06:59.0  )
Ram Charan
X

దిశ, సినిమా : మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత చేయబోయే మూవీ (#RC15)పై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించనున్నట్టుగా అధికారిక ప్రకటన వెలువడింది. ఎస్‌వీసీ బ్యానర్‌కు ఇది 50వ సినిమా కాగా.. ‘రెండు బలమైన శక్తులను వెండితెరపై చూపించబోతున్నాం, ఇది మాకొక మైలు రాయి. ఇండియన్ షో మ్యాన్ శంకర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్‌తో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది’ అని మేకర్స్ తెలిపారు. కాగా ఈ మూవీ పవర్‌ఫుల్ కథాంశంతో తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇక కమల్ హాసన్-శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఇండియన్-2’ షూటింగ్, లాక్‌డౌన్ తర్వాత మళ్లీ ప్రారంభం కాలేదు. ఇది పూర్తయిన తర్వాతనే చెర్రీ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తుండగా.. తాజా ప్రకటనతో మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed