- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ హీరోయిన్‌ను టాలీవుడ్ పక్కనబెట్టిందా?
దిశ, సినిమా : టాలీవుడ్‌లో స్టార్ స్టేటస్‌ను అందుకున్న పంజాబీ బ్యూటీ రకుల్‌ప్రీత్ సింగ్.. ప్రస్తుతం బాలీవుడ్‌పై ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. ఒక దశలో తెలుగు స్టార్ హీరోలు, దర్శకులకు వాంటెడ్ హీరోయిన్‌గా ఉన్న భామ.. ‘యారియాన్’ మూవీ ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం అజయ్ దేవ్‌గన్ లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న ‘దే దే ప్యార్ దే’తో పాటు నీరజ్ పాండే డైరెక్షన్‌లో ‘అయ్యారి’ చిత్రంలో నటిస్తోంది. ఇక టాలీవుడ్ విషయానికొస్తే.. నితిన్, ప్రియా ప్రకాశ్ వారియర్ కాంబినేషన్‌లో 2020లో రిలీజైన ‘చెక్’ మూవీలో తప్ప మళ్లీ కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే రకుల్‌కు తెలుగులో అవకాశాలు లేవనే రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. అయితే బ్యాక్ టు బ్యాక్ హిందీ సినిమాలతో బిజీగా ఉండటం వల్లే తెలుగులో చేయలేకపోతున్నానని చెప్పిన రకుల్.. ‘ఇలాంటి వార్తలు విన్నప్పుడు ఆశ్చర్యమేస్తుంది. 365 రోజుల్లో ప్రస్తుతం నేను చేస్తున్న 6 సినిమాల కంటే ఎక్కువగా చేయొచ్చంటే, ప్లీజ్ నా టీమ్‌కు హెల్ప్ చేయండి. ఇంకా ఏమైనా హెడ్‌లైన్స్ ఉన్నాయా?’ అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇక అర్జున్ కపూర్‌తో రకుల్ నటించిన హిందీ మూవీ ‘సర్దార్ కా గ్రాండ్‌సన్’ ఇటీవలే రిలీజైన సంగతి తెలిసిందే.