నెటిజన్‌పై రకుల్ పైర్

by Shyam |
నెటిజన్‌పై రకుల్ పైర్
X

సెలబ్రిటీలను ఆరాధించేవాళ్లు ఎంతోమంది ఉంటారు. అలానే వాళ్లను ట్రోల్ చేసే వాళ్లు, తిట్టే వాళ్లు కూడా ఎక్కువగానే ఉంటారు. ముఖ్యంగా సినీతారలు ఏం చేసినా కొందరు అదే పనిగా అసభ్యంగా కామెంట్లు చేస్తుంటారు. హీరోయిన్లు వస్ర్తధారణపై నెటిజన్లు చేసే కామెంట్లు వారిని ఎంతో బాధించడంతోపాటు, ఆగ్రహానికి గురి చేస్తాయి. తాజాగా రకుల్‌కు కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. తను వేసుకున్న డ్రెస్‌పై అసభ్యంగా కామెంట్ చేసిన నెటిజన్‌పై రకుల్ కాస్త ఘాటుగానే స్పందించింది.

రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన సినిమా సమాచారాన్ని, ఫోటో షూట్స్‌లను అభిమానులతో పంచుకుంటుంది. రకుల్ అభిమానులు ఆమె పెట్టే ఫొటోలకు పాజిటివ్‌గా రియాక్ట్ అవుతారు. చాలా అందంగా ఉన్నావంటూ పొగడ్తల వర్షం కురిపిస్తుంటారు. అయితే అదే స్థాయిలో విమర్శించే వారున్నారు. అయితే ఇంకొందరు నెటిజన్లు మాత్రం రకుల్ వస్ర్తధారణపై అసభ్య కామెంట్లు చేస్తుంటారు. గతేడాది జనవరిలో రకుల్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో కారు నుంచి దిగుతున్న ఓ ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటో కింద ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ.. ‘కింద ఏమీ ధరించలేదా? కారులో ఎంజాయ్ చేసి అలానే బయటకు వచ్చారా?’ అని చాలా అసభ్యంగా కామెంట్‌ చేశాడని రకుల్ వెల్లడించింది. దీంతో తనకు కోపం తన్నుకురావడంతో అంతే స్ట్రాంగ్‌గా.. ‘మీ అమ్మ అలా చేసి ఉంటుంది. అందుకే దాన్ని తలచుకుని నన్ను కామెంట్‌ చేశావు’ అని కౌంటర్ ఇచ్చినట్లు పేర్కొంది. ఇలాంటి కామెంట్లు చేసేవారిలో చాలా వరకు నకిలీ ఫేస్‌బుక్‌ ఐడీలనే వాడుతుంటారని రకుల్ తెలిపింది. అసలు ముఖాలను చూపడానికి ధైర్యం లేని పిరికివారే అసభ్యంగా కామెంట్స్‌ చేస్తుంటారంది. కొందరు చేసే అసభ్యకరమైన కామెంట్లు మనసును బాధిస్తాయని రకుల్‌ చెప్పింది. మహిళలను విలాస వస్తువుగా చూసే సమాజం దృష్టి మారాలని అంది. సోషల్ మీడియాలోనే కాదు.. ప్రపంచంలోనే మహిళలపై ప్రతికూల ప్రవర్తన, ద్వేషం నిండి ఉందని, ఆరోగ్యకరమైన విమర్శను నేను ఎప్పుడూ స్వాగతిస్తానని, కానీ ఇలా అసభ్యంగా మాట్లాడితే తట్టుకోలేనని ఆమె చెప్పింది. రకుల్ కు ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేకపోయినా, తమిళం, హిందీ భాషల్లో రెండేసి చిత్రాలతో బిజీగానే ఉంది. కోలీవుడ్‌లో కమలహాసన్‌తో కలిసి ఇండియన్‌–2 చిత్రంలో నటిస్తోంది. అదే విధంగా శివకార్తికేయన్‌కు జంటగా ‘‘ఐలాన్‌’’ చిత్రంలో నటిస్తోంది.

Tags : rakul preet singh, anchor rashmi, netizens, instagram, troll, comments, photo shoot, rakul fire

Advertisement

Next Story