'రాక్షసుడు 2'.. మాకు అడవి శేషే కావాలి

by Shyam |   ( Updated:2021-07-13 03:56:04.0  )
rakshasudu 2
X

దిశ, వెబ్‌డెస్క్: క్రైమ్ థ్రిల్లర్ చిత్రాల్లో ఒక రేంజ్ ని క్రియేట్ చేసిన చిత్రం ‘రచ్చసన్’. ట్విస్టుల మీద ట్విస్టులు.. సీట్ ఎడ్జ్ మీద కుర్చోపెట్టే స్క్రీన్ ప్లే.. భయంతో నరాలు వణికించే సంగీతం వెరసి ‘రచ్చసన్’ ఆ ఏడాదికే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తమిళ్ లో భారీ హిట్ అందుకున్న ఈ చిత్రం తెలుగులో ‘రాక్షసుడు’ పేరుతో రీమేక్ అయిన విషయం తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్నే అందుకుంది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ రానున్నట్లు మొదట్లోనే చెప్పిన దర్శకుడు చెప్పినట్లుగానే రెండో పార్ట్ కి కథ సిద్దమైనట్లు తెలిపాడు. అంతే కాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసి షూట్ బిగిన్స్ అంటూ సర్ ప్రైజ్ కూడా ఇచ్చాడు.

తాజాగా రాక్షసుడు’ చిత్రానికి సీక్వెల్ గా ”రాక్షసుడు 2” అనే క్రైమ్ థ్రిల్లర్ ను తెరకెక్కించనున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ‘హోల్డ్ యువర్ బ్రీత్’ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా వస్తుంది. టైటిల్ పోస్టర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ఒక సైకో కిల్లర్ చేతిలో గొడ్డలిని పట్టుకొని.. భుజంపై ఒక మృత దేహాన్ని మోసుకెళ్ళడం.. అలానే రక్తం కారుతున్నఓ కత్తిని గొలుసుతో వేలాడదీయడం కనిపిస్తున్న ఈ పోస్టర్ భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అయితే ఈ సీక్వెల్ లో హీరో ఎవరు అనేది మాత్రం మేకర్స్ ప్రకటించలేదు. పార్ట్ 1 లో నటించిన బెల్లంకొండనే హీరోగా తీసుకున్నారా..? లేక వేరే స్టార్ హీరో నటిస్తున్నాడా..? అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ పోస్టర్ పై అభిమానులు కొంత ఆశ్చర్యంతో పాటు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు.

“‘రాక్షసుడు’ పార్ట్ రాబోతున్నందుకు ఆనందంగా ఉన్నా.. హీరో మళ్లీ బెల్లంకొండ అన్న అయితే కష్టం” అంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఇక మరికొంతమంది అభిమానులైతే “యంగ్ హీరో అడవి శేష్ అయితేనే ఈ సినిమాకు కరెక్ట్ గా సెట్ అవుతాడు.. అప్పుడే సినిమాలో ట్విస్టుల మీద ట్విస్ట్ లు ఉంటాయంటూ” చెప్పుకొచ్చాడు. మరి వీరందరూ అనుకున్నట్టు ఈ సినిమాలో ఏ హీరో ఉండబోతున్నాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే..

Advertisement

Next Story