- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rakhi Sawant:ముంబై రోడ్లపై ఐటెం గర్ల్ షో.. ఇబ్బంది పెట్టిన అంకుల్
దిశ, సినిమా: ఐటెమ్ గర్ల్ రాఖీ సావంత్‌ను(Rakhi Sawant) కన్ను ఆర్పకుండా చూస్తూ ఇబ్బందిపెట్టిన ఓ అంకుల్‌కు వార్నింగ్ ఇచ్చింది. ముంబై వీధుల్లో ఇంటర్వ్యూ ఇస్తున్న రాఖీ… తనను ఓ వ్యక్తి అలాగే అబ్జర్వ్ చేస్తున్నాడని గుర్తుపట్టి అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించింది. ‘ ఏం అంకుల్ ఎప్పుడూ ఆడపిల్లను చూడలేదా? నేను ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్లిపోండి’ అని చెప్పింది. దీంతో ఆ వ్యక్తి వెంటనే బైక్ స్టార్ట్ చేసి స్పీడ్‌గా వెళ్తుండటంతో.. ‘హలో కొంచెం జాగ్రత్తగా వెళ్లు. నీకేదైనా ప్రమాదం జరిగితే ఆ తప్పు నా మీదకు వస్తుంది’ అని సూచించింది. కాగా ఇదే ఇంటర్వ్యూలో యాక్టర్ పర్ల్ వి పూరి మైనర్ బాలిక రేప్ కేసులో అరెస్ట్ కావడంపై స్పందించింది రాఖీ. దేవుడొచ్చి చెప్పినా సరే తను ఆ తప్పు చేశాడంటే నమ్మనని తెలిపింది. ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్న రాఖీ.. అమ్మాయి బ్లాక్ మెయిల్ చేస్తుందని ఎందుకు అనుకోకూడదని తెలిపింది. కాగా 2019లో ఐదేళ్ల బాలికపై రేప్ ఘటనలో తాజాగా బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా నటుడిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు. దీనిపై విచారించిన న్యాయస్థానం నిందితుడికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ తీర్పునిచ్చింది.