- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆ సమావేశాలు రెండు రోజులు ముందుగానే ముగింపు
by Shamantha N |

X
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిన షెడ్యూల్ కంటే రెండు రోజులు ముందుగానే రాజ్యసభ సమావేశాలు ముగుస్తున్నాయి. కేంద్ర బడ్జెట్ తొలి దఫా చర్చలు రాజ్యసభలో 15వ తేదీకి బదులు 13వ తేదీనే ముగించనున్నట్టు పెద్దలసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఈ సమావేశాల్లో అన్ని పార్టీల నేతలు క్రియాశీలంగా పాల్గొనాలని, సజావుగా చర్చలు జరగడానికి సహకరించాలని అఖిలపక్ష సమావేశంలో ఆయన కోరారు. వెంకయ్య నాయుడు విజ్ఞప్తికి అందరూ సమ్మతించారు. అఖిలపక్ష సమావేశానంతరం పార్టీల నేతల అభ్యర్థన మేరకు షెడ్యూల్ కుదింపు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందింది. ఈ నెల 13న తొలి దఫా చర్చలు ముగిశాక పలు శాఖలు కోరిన గ్రాంట్లపై పార్లమెంటరీ కమిటీల శాఖ కసరత్తు చేస్తుంది. తర్వాత మళ్లీ మార్చి 8న పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతాయి.
Next Story