గుండె సమస్యలు లేవు : జయప్రకాశ్ భార్య

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి మరణంపై ఆయన భార్య రాజ్యలక్ష్మీ తాజాగా స్పందించారు. మా కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ రావడంతో తామిద్దరం పెంట్‌హౌస్‌లో ఉంటున్నామని చెప్పారు. వారం రోజులుగా ఆయనకు షుగర్ లెవల్స్ పడిపోతూ ఉండటంతో కొంత అనారోగ్యంగా ఉంటున్నారని, అంతేగానీ ఎలాంటి గుండె సంబంధిత సమస్యలు లేవని ఆమె స్పష్టం చేశారు.

తాము మూడేళ్లుగా గుంటూరులోనే ఉంటున్నామని, ఏమైనా షూటింగ్స్ ఉంటే ఆయన హైదరాబాద్ కు వెళ్లి వచ్చేవారని రాజ్యలక్ష్మీ వివరించారు. కరోనా వలన షూటింగ్స్ లేకపోవడంతో ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నారని, తాజాగా చేయించుకున్న టెస్టుల్లో ఆయనకు నెగెటివ్ వచ్చిందని చెప్పారు. అయినా ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

Advertisement