‘లడాఖ్‌’పై రాజ్‌నాథ్ సమీక్ష

by Shamantha N |
‘లడాఖ్‌’పై రాజ్‌నాథ్ సమీక్ష
X

న్యూఢిల్లీ: బలగాల ఉపసంహరణ నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మిలిటరీ ఉన్నతాధికారులతో లడాఖ్‌లో నెలకొన్న పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణె, నేవీ చీఫ్ అడ్మిరైల్ కరంబీర్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ బదౌరియా సహా టాప్ మిలిటరీ అధికారులతో సమావేశమయ్యారు. గాల్వన్ లోయ, గోగ్రా, హాట్‌స్ప్రింగ్స్ సెక్టార్, ప్యాంగాంగ్ సో ఏరియాలో బలగాల ఉపసంహరణపై జనరల్ నరవాణె కేంద్ర మంత్రికి సమగ్రంగా వివరించారు. అలాగే, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు ఎదురైన ఎదుర్కోవడానికి ఆర్మీ సంసిద్ధతనూ తెలిపారు.

సరిహద్దు ఉద్రిక్తతలపై యూఎస్‌తో రాజ్‌నాథ్ సింగ్ చర్చ

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమెరికా రక్షణ శాఖ సెక్రెటరీ మార్క్ టీ ఎస్పర్‌తో చైనాతో సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలపై చర్చించారు. వీరిరువురు ద్వైపాక్షిక సంబంధాలు, రక్షణ సంబంధ సహకారం, ఇరుదేశాల ప్రయోజనాలపై ఫోన్‌ కాల్‌లో మాట్లాడినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. అయితే, వీరిరువురు కొన్నాళ్లుగా ఈ అంశాలపై ఫోన్‌లో చర్చలు సాగిస్తున్నట్టు తెలిపారు. శుక్రవారం నాటి ఫోన్ కాల్ మాత్రం అమెరికా రక్షణ శాఖ సెక్రెటరీ మార్క్ టీ ఎస్పర్‌ అభ్యర్థనతో ప్రారంభించినట్టు వివరించారు.


Advertisement
Next Story

Most Viewed