ఉపరాష్ట్రపతిని గమనిస్తూనే ఉన్నా.. : రాజ్‌నాథ్‌సింగ్

by Anukaran |
ఉపరాష్ట్రపతిని గమనిస్తూనే ఉన్నా.. : రాజ్‌నాథ్‌సింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ఉపరాష్ట్రపతి పదవికే వెంకయ్యనాయుడు వన్నె తెచ్చారని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్య పదవీ బాధ్యతలు చేపట్టి నేటికి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఉపరాష్ట్రపతి కాకముందు నుంచి వెంకయ్యను గమనిస్తున్నాను అని, చాలా సందర్భాల్లో సమన్వయంతో వ్యవహరించేవారని పేర్కొన్నారు. వెంకయ్యనాయుడి నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి అని, ఇతరులతో ఎలా మాట్లాడాలనేది వెంకయ్య నుంచి నేర్చుకోవొచ్చు కేంద్రమంత్రి వివరించారు. అనేక విషయాలపై వెంకయ్యనాయుడు పట్టు సాధించారంటూ రాజ్ నాథ్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed