- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా రాజీవ్ రంజన్
by Shamantha N |
X
న్యూఢిల్లీ: బిహార్‌లోని అధికార పార్టీ జనతా దళ్(యునైటెడ్) జాతీయ అధక్ష్యుడిగా ఎంపీ రాజీవ్ రంజన్ అలియాస్ లాలన్ సింగ్ నియమితులయ్యారు. బిహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ అధ్యక్షతన ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో శనివారం నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలోనే లాలన్ సింగ్ జేడీయూ నూతన జాతీయ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఈ పదవిలో అంతకుముందున్న ఆర్సీపీ సింగ్‌కు ఇటీవల ఏర్పాటైన మోడీ కొత్త కేబినెట్‌లో చోటుదక్కింది. ఈ క్రమంలో ఆయన శనివారం పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో అత్యంత సన్నిహితుడైన రాజీవ్ రంజన్‌ను నియమిస్తూ నితీశ్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. కాగా, బిహార్‌లోని ముంగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందిన లాలన్ సింగ్, గతంలో జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడిగానూ విధులు నిర్వర్తించారు.
Advertisement
Next Story