బజాజ్ కంపెనీ విజయానికి ఎఫ్ఐటీ సూత్రం : రాజీవ్ బజాజ్!

by Harish |
బజాజ్ కంపెనీ విజయానికి ఎఫ్ఐటీ సూత్రం : రాజీవ్ బజాజ్!
X

దిశ, వెబ్‌డెస్క్: బజాజ్ ఆటోమొబైల్స్ సీఈవో, ఎండీ రాజీవ్ బజాజ్ తమ కంపెనీ విజయానికి కారణాలను వెల్లడించారు. బజాజ్ కంపెనీ విజయానికి ఎఫ్ఐటీ అనే మూడు సూత్రాలని.. అవి ఎఫ్ అంటే ఫోకస్, ఐ అంటే ఐడియా, టీ అంటే టీమ్ అని వివరించారు. పని మీద ఫోకస్ చేస్తూ కొత్త ఐడియాలతో కస్టమర్లకు అవసరమైన వాటిని అందించేదే తమ కంపెనీ సూత్రమని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్‌ను ప్రతిక్షణం అధ్యయనం చేస్తూ కాలంతో పాటే విభిన్నమైన మోడళ్లను తయారు చేస్తున్నామని రాజీవ్ బజాజ్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లను అనుసరిస్తూ కొత్త ఐడియాలను అధ్యయనం చేస్తున్నామని రాజీవ్ బజాజ్ స్పష్టం చేశారు. అలాగే, తమ కంపెనీలోని ఉద్యోగుల పనితీరు విజయానికి కారణమని, అందుకే ప్రతిభ ఉన్న సిబ్బందిని నియమించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. జపనీస్ నాణ్యత, యూరప్ డిజైన్, ఇండియా ధరలను అనుసరిస్తూ ఉత్పత్తి చేస్తున్న ఏకైక ఆటో మొబైల్ కంపెనీ బజాజ్ అని రాజీవ్ చెప్పారు. అంతేకాకుండా, పోటీలో ఉన్న కంపెనీలకు ధీటుగా చౌకైన, బైకులు, అధిక మైలేజీ ఇచ్చే బైకులు, ఖరీదైన బైకులు ఇలా అన్ని విభాగాల్లో గొప్పగా తయారు చేస్తున్నామని అన్నారు. అయితే, ఇండియాలో మోటార్ సైకిల్ వ్యాపారంలో ప్రపంచ మోటార్ సైకిల్ వ్యాపార స్థాయిలో నిర్వహణకు కొన్ని అడ్డంకులున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కరోనా నియంత్రణకు ఆసియా దేశాలైన జపాన్‌, దక్షిణ ‌కోరియా విధానాలను అనుసరించాలని సూచించారు. వైరస్‌ను నియంత్రించి, ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్న జపాన్‌, దక్షిన ‌కోరియాల విధానాలను అధ్యయనం చేయాలని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed