'చంద్రముఖి 2' .. రజినీ, లారెన్స్ కాంబినేషన్

by  |
చంద్రముఖి 2 .. రజినీ, లారెన్స్ కాంబినేషన్
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ రజినీకాంత్… ఆరుపదుల వయస్సులోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నాడు.. మొన్నటికి మొన్న తలైవాఆన్‌డిస్కవరీ ప్రోగ్రాంతో ట్రెండ్‌లో ఉన్న రజినీ… సినిమాల విషయంలో యంగ్ స్టర్స్‌కు పోటీ ఇస్తున్నాడు. తన దారి రహదారి బెట్టర్ డోంట్ కమ్ ఇన్ మై వే అంటూ హెచ్చరిస్తున్న స్టైల్ ఐకాన్ … సినిమా మీద సినిమా చేస్తూ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో 168వ సినిమా ‘అన్నాత్తె’ చేస్తున్న తలైవా…. ఇప్పుడు అదే బ్యానర్‌లో మరో ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడట. హారర్ కామెడీ సూపర్ హిట్ మూవీ ‘చంద్రముఖి’ సీక్వెన్స్‌తో ప్రేక్షకులను అలరించబోతున్నాడట. ఈ విషయాన్ని డైరెక్టర్, యాక్టర్, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ అధికారికంగా ప్రకటించారు. రజినీకాంత్ ఆశీర్వాదంతో తాను కూడా ఈ సినిమాలో నటించబోతున్నట్లు తెలిపిన లారెన్స్… ‘చంద్రముఖి’ దర్శకులు పి. వాసు సీక్వెన్స్‌ కూడా డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలిపారు. సన్ పిక్చర్స్ నిర్మాత కళానిధి మారన్ తన లక్కీ ప్రొడ్యూసర్ అన్న రాఘవ…. ఈ సినిమా కోసం ఇచ్చిన అడ్వాన్స్‌ రూ. 3 కోట్లను కరోనా ఎఫెక్ట్‌తో బాధపడుతున్న వారికి అందజేస్తానని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

రూ. 50 లక్షలు పీఎం కేర్స్ ఫండ్‌కు, రూ. 50 లక్షలు తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి అందిస్తున్నట్లు తెలిపిన లారెన్స్… రూ. 50 లక్షలు ఫెఫ్సీ యూనియన్‌కు, మరో రూ. 50 లక్షలు డ్యాన్సర్స్ యూనియన్‌కు విరాళంగా ఇస్తున్నట్లు చెప్పారు. రూ. 25 లక్షలు వికలాంగులకు ఇస్తున్న లారెన్స్… తను పుట్టి పెరిగిన రోయాపురం, దేశీయానగర్ ప్రాంత కూలీలకు రూ. 75 లక్షలు వినియోగించనున్నట్లు చెప్పారు. వారి భోజనానికి కావాల్సిన సరుకులను పోలీసుల సహాయంతో అందిస్తామన్నారు. సేవను దేవుడిగా అభివర్ణించిన లారెన్స్… ప్రజలంతా ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని కోరారు.

Tags: Chandramukhi, Rajinikanth, Raghava Lawrence, Kollywood, P. Vasu, SUN Pictures



Next Story